Oct 04, 2026, 05:10 IST/
తెలంగాణలో సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్సు ప్రయాణం?
Oct 04, 2026, 05:10 IST
తెలంగాణ ప్రభుత్వం 'మహాలక్ష్మి' పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఇప్పుడు, సీనియర్ సిటిజన్లకు కూడా అదే తరహాలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. వృద్ధుల అభ్యర్థనలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా రవాణాపై వారి ఆధారపడటాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు 25 శాతం రాయితీ ఉండగా, తెలంగాణలో పూర్తిగా ఉచిత ప్రయాణంపై ఆలోచన చేస్తోంది.