Sep 26, 2026, 05:09 IST/నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ అర్బన్
ధర్పల్లిలో 18 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Sep 26, 2026, 05:09 IST
ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను శనివారం పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో వైద్యం చేయించుకుని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు ఈ సహాయం అందింది. ఈ సందర్భంగా తమకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందడం పట్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్యూర్ చిన్న బాల్రాజ్, సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్, ఎజ్జ శ్రీకాంత్, గ్రామ శాఖ అధ్యక్షుడు చక్రపాణి, సొసైటీ చైర్మన్ మల్లికార్జున్, రాజ్ కుమార్, ఆనంద్, అజయ్, నిమ్మల వినయ్ గౌడ్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.