Sep 17, 2026, 05:09 IST/
జనన, మరణాల నమోదు చట్టం.. అక్టోబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు
Sep 17, 2026, 05:09 IST
దేశవ్యాప్తంగా 'జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం-2026' నిబంధనలు అక్టోబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి. ఆలస్య నమోదులను క్రమబద్ధీకరించడం, నకిలీ సర్టిఫికెట్లను అరికట్టడం లక్ష్యంగా భారత రిజిస్ట్రార్ జనరల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సవరణ చట్టం ద్వారా డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. పాఠశాల ప్రవేశాలు, పాస్పోర్ట్, ఓటర్ కార్డు, వివాహ నమోదు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు జనన ధ్రువీకరణ పత్రం కీలక ప్రాథమిక పత్రంగా మారుతుంది.