Sep 26, 2026, 12:09 IST/
తెలంగాణలో జీపీ, మహిళా సంఘాల భవనాల నిర్మాణం వేగవంతం: మంత్రి సీతక్క
Sep 26, 2026, 12:09 IST
తెలంగాణలోని ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల భవనాలు, హ్యామ్ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సొంత భవనాలు లేని 5,118 గ్రామ పంచాయతీల కోసం రూ. 1,000 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే 3,269 భవనాల నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయని, మిగిలినవి ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 8,000 గ్రామాల్లో మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి రూ. 800 కోట్లు కేటాయించి, పనులు చివరి దశకు చేర్చినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీక్షలో మంత్రి వెల్లడించారు.