Sep 17, 2026, 12:09 IST/
VIDEO: భార్యపై యాసిడ్ పోసి.. కత్తితో దాడి చేసిన భర్త
Sep 17, 2026, 12:09 IST
బెంగళూరులోని జేపీ నగర్ 3వ దశలో గురువారం ఉదయం 26 ఏళ్ల నర్సు మధుమితపై ఆమె భర్త వెంకటేశన్ కత్తి, కొడవలి, యాసిడ్తో దాడి చేశాడు. దంపతుల మధ్య వివాదం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అల్పాహారం కోసం క్లినిక్ నుంచి బయటకు వచ్చిన మధుమితపై పార్కింగ్ ప్రాంతంలో వెంకటేశన్ కొడవలితో దాడి చేసి, యాసిడ్ పోశాడు. స్థానికులు, ట్రాఫిక్ సిబ్బంది సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన మధుమిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.