
చెరువులో పడి మహిళ మృతి
మనోవేదన, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ చెరువులో పడి మృతి చెందిన ఘటన రాజంపేట మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజంపేట ఎస్సై భువనేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన మాల నరసవ్వ (50) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, మతిస్థిమితం సరిగా లేక గ్రామంలో తిరుగుతూ ఉండేది. ఈ క్రమంలో మంగళవారం మనోవేదనకు గురైన ఆమె దేవుని చెరువులో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భువనేశ్వర్ తెలిపారు.



































