టీనేజర్ల సోషల్ మీడియాపై నో ‘బ్యాన్’!

42చూసినవారు
టీనేజర్ల సోషల్ మీడియాపై నో ‘బ్యాన్’!
సోషల్ మీడియాకు పిల్లలు, టీనేజర్లు బానిసలవుతున్న నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ (MeitY) కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. పూర్తి నిషేధం కంటే, ప్లాట్‌ఫారమ్‌లనే సురక్షితంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. అమెరికాలోని మెటా తరహా నిబంధనలను భారత్‌లోనూ అమలు చేస్తూ, రోజుకు గరిష్టంగా రెండు గంటల వినియోగం, స్కూల్ వేళల్లో నోటిఫికేషన్ల నిలిపివేత, అర్ధరాత్రి యాప్ బ్లాక్ చేయడం వంటి ఆంక్షలు విధించనున్నారు. ఏ మార్పులకైనా తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత పోస్ట్