నేపాల్లోని భోటేకోశీ వరదల్లో గల్లంతైన 26 మంది యాత్రికుల మృతదేహాలు లభించకపోవడంతో, వారి బంధువులు దర్భలతో (గడ్డి) ప్రతీకాత్మక మానవ ఆకారాలను తయారుచేసి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 10న నౌఖోర్ నుంచి గోసాయింకుండ పుణ్యక్షేత్రానికి వెళ్తున్న వాహనం వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆచూకీ లభించకపోవడంతో, స్థానిక పురోహితుల సూచన మేరకు గడ్డితో బొమ్మలు తయారు చేసి, వాటికి బార్లీ పిండిని పూసి శవాలుగా భావించి వేదమంత్రాల మధ్య దహన సంస్కారాలు జరుపుతున్నారు.