తెలంగాణ కాంగ్రెస్లో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవులు, పార్టీ పోస్టుల భర్తీపై మళ్లీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను డిసెంబరులో పూర్తి చేయాలని CM రేవంత్, పీసీసీ చీప్ మహేశ్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జీ సందీప్ కుమార్ ఓ అవగాహనకు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. గురువారం ఈ విషయంపై వరుసగా చర్చలు జరిగాయి. పార్టీలో ఖాళీగా ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార తదితర కమిటీలు, కార్యదర్శుల
నియామకాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. డిసెంబర్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆశావహులు ఎదురుచేస్తున్నారు.