వర్క్‌ వీసాపై భారత్‌లో ఉన్నా: నోరా ఫతేహి

1చూసినవారు
వర్క్‌ వీసాపై భారత్‌లో ఉన్నా: నోరా ఫతేహి
రూ.200 కోట్ల మోసం కేసులో సాక్షిగా ఉన్న బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. తాను కెనడా పౌరురాలినని, వర్క్‌ వీసాపై భారత్‌లో ఉంటున్నట్లు తెలిపారు. 2020లో సుకేశ్‌ చంద్రశేఖర్‌ భార్య లీలా పాలోస్‌ ఓ కార్యక్రమానికి తనను ఆహ్వానించారని, ఆ సమయంలో సుకేశ్‌ ఫోన్‌లో మాట్లాడి కారును బహుమతిగా ఇస్తానన్నారని కోర్టుకు వివరించారు. ఈ కేసులో గతంలో రెండుసార్లు సమన్లు జారీ చేసినా హాజరుకాకపోవడంతో కోర్టు మందలించింది. తదుపరి విచారణను నవంబర్‌ 30కి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్