అరెస్ట్ కాదు.. కిడ్నాప్ చేశారు: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ

0చూసినవారు
యూట్యూబర్ ధ్రువ్ రాఠీని పోలీసులు విడుదల చేశారు. రిలీజ్ తర్వత ధ్రువ్ వీడియో రిలీజ్ చేశారు. 'నాకు ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంది. నేను ఇండియన్ సిటిజన్‌ను. సామాన్య భారతీయుడికి హక్కు ఉన్నట్లే నాకు నిరసన తెలిపే హక్కు ఉంది. నిన్న నన్ను అరెస్ట్, డిటెన్షన్ కాదు కిడ్నాప్ చేశారు. 50 మంది గూండాలు నా ఇంటిపై దాడి చేసి నన్ను లాక్కెళ్లారు. ఆ తర్వాత నన్ను ఒక పోలీస్ స్టేషన్‌లో 24 గంటలు కూర్చోబెట్టి, నా ఫోన్ లాక్కొని, లాయర్‌తో కూడా కలవనివ్వలేదు. మోదీ ఈ దేశాన్ని డిక్టేటర్‌షిప్ చేశారు. ఇక్కడ అప్రకటిత ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది' అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్