ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యులకు ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నోటీసులు జారీ చేసింది. న్యూఢిల్లీ-40 అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైన కేజ్రీవాల్, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్, తల్లిదండ్రులు గోవింద్ రామ్ కేజ్రీవాల్, గీతా దేవి పేర్లతో పాటు మొత్తం 110 మంది ఓటర్లకు ఈ నోటీసులు అందాయి. ఈ పరిణామంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. మరోవైపు, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసు జారీ అయింది.