
భారీగా పెరిగిన డైట్ కోక్ ధరలు
దేశంలో అల్యూమినియం క్యాన్ల కొరత, తయారీ వ్యయం పెరగడంతో కోకా-కోలా సంస్థకు చెందిన డైట్ కోక్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, గోవా వంటి ప్రధాన నగరాల్లో 330 మి.లీ డైట్ కోక్ క్యాన్ ధర రూ.50 నుండి రూ.70కి చేరింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అల్యూమినియం ధరలు 30% పెరగడం, జీరో-కాలరీ పానీయాలకు డిమాండ్ రెట్టింపు కావడం దీనికి ప్రధాన కారణాలు. భారతీయ నిబంధనలకు కట్టుబడి ఎంఆర్పీ ధరకే విక్రయించాలని కోకా-కోలా ట్రేడ్ భాగస్వాములకు సూచించింది




