TG: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతారాహిత్య ఘటన
వెలుగుచూసింది. మున్స
ిపల్ కమిషనర్ బదిలీ సందర్భంగా సిర్పూర్ అటవీ ప్రాంతంలోని గుడి వద్ద ఏర్పాటు చేసిన వీడ్కోలు విందుకు అధికారులంతా హాజరయ్యారు. దీంతో కార్యాలయం ఖాళీగా దర్శనమిచ్చింది. ఇదే సమయంలో సబ్ కలెక్టర్ హర్ష చౌదరి ఆకస్మిక తనిఖీలు చేపట్టగా పలు విభాగాల కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ప్రజల పనులను పక్కనపెట్టి విందులకు ప్రాధాన్యత ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.