పాత కక్షలు.. వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు

30చూసినవారు
పాత కక్షలు.. వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు
TG: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో దారుణం జరిగింది. పెద్దపాపయ్యపల్లిలో ఓ వ్యక్తిని అతికిరాతకంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలో ఉప్పలపల్లికి చెందిన రాకేశ్‌ను ప్రశాంత్​ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. హత్య అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్