ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లా పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తరువా దిహ్ ప్రాంత సమీపంలో 8 మంది ప్రయాణికులతో వెళ్తున్న మారుతి ఓమ్నీ వ్యాన్, ఎదురుగా వస్తున్న ట్రైలర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, అమరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ మెడికల్ కాలేజీకి తరలించారు.