తగ్గనున్న ఉల్లి ధరలు!

7చూసినవారు
తగ్గనున్న ఉల్లి ధరలు!
వినియోగదారులకు గుడ్ న్యూస్. ఉల్లి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఖరీఫ్ పంట దిగుబడులు మార్కెట్‌లోకి వచ్చాయి. అలాగే కేంద్రం పాత నిల్వల తరలింపును పెంచింది. దాంతో ఉల్లి ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 10 నాటికి దేశవ్యాప్తంగా ఉల్లి ధర కిలో రూ.52.99గా నమోదైంది. నెల క్రితం రూ.53.10గా ఉండేది. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.100కు 2-2.5 కేజీల ఉల్లిని విక్రయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్