ఆన్‌లైన్ బెట్టింగ్, మనీలాండరింగ్ గుట్టు రట్టు

7చూసినవారు
ఆన్‌లైన్ బెట్టింగ్, మనీలాండరింగ్ గుట్టు రట్టు
ఆన్‌లైన్ బెట్టింగ్, మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ 27న ముంబయి ఈడీ అధికారులు సాగర్‌దాస్‌ను అరెస్టు చేశారు. ఈడీ దర్యాప్తులో ఆల్ ప్యానెల్ ఎక్స్‌ఛేంజ్ (ఏపీఎక్స్‌) వేదికగా కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా వందల కోట్లు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ముంబయి పీఎంఎల్‌ఏ కోర్టు సాగర్‌దాస్‌కు 3 రోజుల కస్టడీ విధించింది. మ్యూల్ ఖాతాల ద్వారా నగదును షెల్ సంస్థలకు బదిలీ చేసినట్లు, నిందితుడు నకిలీ రికార్డులతో క్రిప్టో ఖాతా తెరిచినట్లు ఈడీ ఆరోపించింది. దర్యాప్తులో భాగంగా సుమారు రూ.9 కోట్ల నిధులను అధికారులు ఫ్రీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్