అయ్యప్పస్వామి దర్శనం కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌

14చూసినవారు
అయ్యప్పస్వామి దర్శనం కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు ఆన్‌లైన్‌లో ముందుగానే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని గురుస్వాములు సూచిస్తున్నారు. మండల పూజ, మకరజ్యోతి వేళ భక్తుల రద్దీతో 12 గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తుండగా.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఉంటే 4-5 గంటల్లో దర్శనం పూర్తవుతుందని చెబుతున్నారు. నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 24 వరకు, డిసెంబర్‌ 31 నుంచి జనవరి 12 వరకు దర్శనానికి బుకింగ్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ లేనివారికి నీలక్కల్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పంబా నదిని కలుషితం చేస్తే రూ.5 వేల జరిమానా విధించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్