రూ.5,000 మాత్రమే విత్‌డ్రాకు అవకాశం: RBI

17చూసినవారు
రూ.5,000 మాత్రమే విత్‌డ్రాకు అవకాశం: RBI
పుదుచ్చేరి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ఆంక్షలు విధించింది. అక్టోబర్ 21, 2026, బుధవారం నుండి ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఖాతాదారులు తమ ఖాతాల నుండి గరిష్ఠంగా రూ.5,000 మాత్రమే ఉపసంహరించుకోవడానికి వీలుంది. డిపాజిటర్ల ప్రయోజనాలను రక్షించడానికి, బ్యాంకు ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ఆరు నెలల పాటు ఈ ఆంక్షలు వర్తిస్తాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. పరిస్థితుల ఆధారంగా వీటిని సమీక్షిస్తామని తెలిపింది.

సంబంధిత పోస్ట్