తెలంగాణలో ఓపెన్ టెన్త్ (SSC), ఇంటర్మీడియట్
పరీక్షలు వచ్చే నెల (అక్టోబర్) 11 నుంచి 17వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ లింగయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థులు హాల్ టికెట్లను www.telanganaopenschool.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పరీక్షకు హాజరయ్యే వారు హాల్ టికెట్‌తో పాటు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకురావాలని తెలిపారు.