జొమాటోలో 40 కిలోమీటర్ల దూరం నుంచీ ఫుడ్‌ ఆర్డర్‌

38చూసినవారు
జొమాటోలో 40 కిలోమీటర్ల దూరం నుంచీ ఫుడ్‌ ఆర్డర్‌
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన వినియోగదారుల కోసం 'లిమిట్‌లెస్‌ డెలివరీ' అనే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా నగరంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెస్టారెంట్ల నుంచి కూడా ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, చెన్నై, ముంబయి, కోల్‌కతా, పుణె నగరాల వాసులకు ఈ సదుపాయం ప్రస్తుతం అందుబాటులో ఉంది. జొమాటో యాప్‌లోని క్విక్‌లింక్ ద్వారా గానీ, నేరుగా రెస్టారెంట్ పేరును వెతికి గానీ ఆర్డర్ చేయవచ్చు. అయితే డెలివరీ ఛార్జీలు, సమయంపై స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్