రాజస్థాన్‌లోని జైపూర్-ఢిల్లీ హైవేపై మనోహర్‌పురా టోల్‌ప్లాజా వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. టోల్‌ప్లాజా సమీపంలో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, బోల్తా పడిన వాహనాన్ని పైకెత్తి అందులో చిక్కుకున్న యువతి, మరో వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో బాధితులకు గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.