
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన భారీ ప్రమాదం
AP: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా సుమారు 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసి, క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది.




