TG: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామంలో విషాదం నెలకొంది. పీఏసీఎస్ డైరెక్టర్ వేముల లక్ష్మణ్‌గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. కొన్నే గ్రామంలోని తన పొలం వద్ద లక్ష్మణ్‌గౌడ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.