AP: రాష్ట్రంలో పాక్ స్పై నెట్‌వర్క్ కలకలం రేపుతోంది. ఫైర్‌వాల్-2026 ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నిర్వహించింది. 18 మందితో పాక్ స్పై నెట్‌వర్క్‌లో 13 మంది నేవీ సిబ్బందిని అనుమానితులుగా గుర్తించారు. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 12 కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలతో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏపీ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా 10 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో నేరుగా టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఎన్‌క్రిప్టెడ్ ఛానళ్ల ద్వారా కీలక సమాచారం చేరవేసినట్లు సమాచారం.