ఒమన్‌లోని అల్ అమెరట్
క్రికెట్ గ్రౌండ్‌లో శనివారం
భారత్, పాకిస్థాన్ జట్లు అండర్-19 ఆసియా కప్ ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా
భారత్ బౌలింగ్ చేయనుంది. గత ఏడాది ఓటమికి ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో
భారత్ బరిలోకి దిగుతుండగా, టైటిల్‌ను నిలబెట్టుకోవాలని పాకిస్థాన్ పట్టుదలతో ఉంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.