TG: హైదరాబాద్‌లో అనుమతులు లేకుండా భారత్‌లోకి దిగుమతి అయిన పాకిస్థాన్ తయారీ కాస్మోటిక్స్ భారీగా పట్టుబడ్డాయి. సెప్టెంబర్ 30వ తేదీన టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సీడీఎస్‌సీఓ అధికారులు నాంపల్లి, హబీబ్‌నగర్ ప్రాంతాల్లోని పలు దుకాణాల్లో దాడులు నిర్వహించి సుమారు రూ.7 లక్షల విలువైన సౌందర్య ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఐదుగురిపై కేసులు నమోదు చేయగా, ఈ ఉత్పత్తులు హైదరాబాద్‌కు ఎలా చేరాయనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.