నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ వేడుకను ఈ నెల 21న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 'జడల్ జమానా తన అడ్డాకు చేరుకొంది' అనే క్యాప్షన్తో ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన 'ఆయా షేర్', 'యేష నాగుల' పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సెన్సేషన్ సృష్టించాయి.