TG: కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివారులోని ఈత, తాటివనాల్లో వింత దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా పండ్లు, గింజలు తినే రామచిలుకలు, తాజాగా కల్లు తాగుతూ సందడి చేశాయి. ప్రకృతిలో అరుదుగా కనిపించే ఈ దృశ్యం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పక్షులు కల్లు తాగేందుకు వస్తున్న ఈ వినూత్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పర్యావరణ ప్రేమికులు, స్థానికులు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.