శ్రీలంకలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. గంగోడ, కడిగమువా మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు రైలులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం.