
ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
TG: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కీలా ధర్మ అనే నిందితుడికి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2021 ఆగస్టు 17న మియాపూర్‌లోని మార్తాండనగర్‌లో కిరాణా షాపుకు వెళ్తున్న బాలికను వెంబడించి, అపార్ట్‌మెంట్ లిఫ్ట్ వద్ద నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అప్పట్లో గచ్చిబౌలిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ మరియు సాక్షుల గుర్తింపు ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.




