దీపావళి కానుకగా పేటీఎం రూ.1,000 ఇస్తోందంటూ వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్న మెసేజ్‌లు నకిలీవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. ఈ మెసేజ్‌లు నమ్మించి, వచ్చే లింకులపై క్లిక్ చేయమని ప్రేరేపిస్తాయని, అలా చేయడం వల్ల వ్యక్తిగత వివరాలు దొంగల పాలై బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఫేక్ మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దని, ఆన్లైన్ లావాదేవీల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఎటువంటి ఆఫర్ల కోసం తెలియని లింక్‌లను క్లిక్ చేయవద్దని స్పష్టం చేశారు.