ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు
భారత్ మద్దతు ఉంటుందని ప్రధాని
మోదీ స్పష్టం చేశారు. 'ఇది యుద్ధాల యుగం కాదు' అని పునరుద్ఘాటిస్తూ, 'ముగింపు లేని యుద్ధం' నుంచి 'యుద్ధ ముగింపు' వైపు పయనించాలని SCO శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ సందర్భంగా సోమవారం
మోదీ పిలుపునిచ్చారు. అన్ని సమస్యలకు శాంతియుత చర్చలే పరిష్కారమని తెలిపారు.
భారత్ బుద్ధుడు, గాంధీ నడిచిన నేల అని, తమ దేశం ఎల్లప్పుడూ సహానుభూతి, శాంతి మార్గాలనే విశ్వసిస్తుందని
మోదీ పేర్కొన్నారు.