పెబ్బేరు మహిళా పాలిటెక్నిక్ విద్యార్థినులకు అస్వస్థత!

0చూసినవారు
పెబ్బేరు మహిళా పాలిటెక్నిక్ విద్యార్థినులకు అస్వస్థత!
TG: వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివారులోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, జ్వరం, నీరసం వంటి అనారోగ్య లక్షణాలు కనిపించడంతో సుమారు 20 మంది విద్యార్థినులను పెబ్బేరు పీహెచ్‌సీకి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బుధవారం రాత్రి కలుషిత ఆహారం తినడం వల్లే అస్వస్థతకు గురై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్