
అమ్మవారి చండీ హోమంలో దుద్దిళ్ల శ్రీనుబాబు దంపతులు
మంథని నియోజక వర్గం ధనవాడ గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చండీ హోమంలో గురువారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దుళ్ల శ్రీనుబాబు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు కార్యక్రమాలు చేయించారు. అనంతరం వేద పండితులు ఆ దంపతులకు ఆశీర్వాదం అందజేశారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీను బాబు ప్రజలందరూ సుభిక్షంగ ఆరోగ్యంగా పాడి పంటతో వర్ధిల్లాలని దేవుని ప్రార్థిస్తూ అందరికీ ముందస్తు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత దీక్ష స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

































