
చంద్రబాబు కాలనీలో వైభవంగా దుర్గామాత పల్లకి సేవ
రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్ చంద్రబాబు కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ కందుకూరి జగదీశ్వర ఆచార్య పురోహితుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి పల్లకి సేవ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గామాత పల్లకి సేవతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.























