హైదరాబాద్ టోలిచౌకీకి చెందిన 66 ఏళ్ల మహిళ ఫేస్బుక్లో ప్రకటన చూసి రూ. 458 పెట్టి రెండు పెన్సిల్ బాక్సులు ఆర్డర్ చేసింది. డెలివరీ ఆలస్యం కావడంతో కస్టమర్ కేర్‌ను సంప్రదించగా.. వాట్సప్‌లో పంపిన 'APK ఫైల్' డౌన్లోడ్ చేయించి రూ. 5 చెల్లించమన్నారు. ఆ తర్వాత మరుసటి రోజే ఆమె కెనరా బ్యాంక్ ఖాతా నుండి రూ. 5,24,102 మాయమయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 29న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు చేపట్టారు.