TG: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పెంపుపై సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చేయూత పెన్షన్లు రూ.4 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇవ్వగా.. ఇప్పటివరకు అమలు కాలేదు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, గతంలో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామన్నారు. ప్రస్తుతం రూ.2 వేలు ఉన్న పెన్షన్ను త్వరలోనే రూ.4 వేలకు పెంచే కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ఈ విషయంలో వైఎస్ఆర్ ఆశయాలను తమ ప్రభుత్వం పాటిస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ.. పింఛన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామన్నారు.