TG: రాష్ట్ర ప్రజలు అయోమయంలో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దసరా వేడుకల్లో భాగంగా సిద్ధిపేటలో ఆయన మాట్లాడారు. ‘వ్యాపారం లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది. రాష్ట్రంలో అన్ని వర్గాలు అయోమయంలో ఉన్నాయి. దసరా అంటేనే మనలో చెడును తొలగించి మంచి నేర్పుతుంది. నిండు కుండలా జలకళతో ఉండే కాళేశ్వరం రంంగనాయక సాగర్‌ను నిర్మించుకున్నాం. జమ్మిపెట్టి తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. అందరూ సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా’ అని తెలిపారు.