
రాయలసీమ యూనివర్సిటీ హాస్టల్లో అపరిశుభ్రత.. కిచెన్ సీజ్!
AP: కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ మెన్స్ హాస్టల్ (తుంగభద్ర బ్లాక్) కిచెన్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వంటగదిలో అపరిశుభ్రత, దుర్వాసన, పేరుకుపోయిన చెత్తను చూసి ఆగ్రహించిన అధికారులు కిచెన్‌ను సీజ్ చేశారు. ఈ క్రమంలో స్టోర్ రూమ్ తెరవకుండా నిరాకరించి, మీడియాపై రిజిస్ట్రార్ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హాస్టల్ నిర్వాహకులపై అధికారులు కేసు నమోదు చేశారు.




