కుప్పకూలిన విమానం.. 17 మంది మృతి

16చూసినవారు
రష్యాలోని కెమెరోవో సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. గాలిలో ఉండగానే An-12 విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అది నిట్టనిలువుగా కిందకు పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారెవరూ ప్రాణాలతో బయటపడలేదు. విమానం తోక చుక్కలా రాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్