నైజీరియాలో బెనిన్ సిటీ నుంచి లాగోస్‌కు బయలుదేరిన వైమానిక దళ
విమానం ఇగ్బోకోడా వద్ద కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 25 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 32 మంది మరణించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు దేశాధ్యక్షుడు బోలా టినుబ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.