శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్

8953చూసినవారు
శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్
TG: శంషాబాద్‌లో విమాన ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. శంషాబాద్ నుంచి విజయవాడ బయల్దేరిన 591 ఎయిర్ లైన్స్ విమానంలో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్