రాప్తాడు బాలికకు ప్లాస్టిక్‌ సర్జరీ విజయవంతం

4చూసినవారు
రాప్తాడు బాలికకు ప్లాస్టిక్‌ సర్జరీ విజయవంతం
AP: రాప్తాడు జడ్‌పీ హైస్కూలులో దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికకు బెంగళూరులో ప్లాస్టిక్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఈ మేరకు సోమవారం మంత్రి లోకేశ్ ట్వీట్ ద్వారా వివరాలు వెల్లడించారు. వైద్యుల బృందం బాలికకు ఊండ్ డీబ్రైడ్‌మెంట్ మరియు కుట్ల సర్దుబాటు ప్రక్రియను ఎటువంటి సమస్యలు లేకుండా పూర్తి చేశారు. గాయాలు వేగంగా మానుతున్నాయని, బాలిక ధైర్యంగా చికిత్సను తట్టుకుందని వైద్యులు తెలిపారు. త్వరలోనే ఆమెను పీఐసీయూ నుంచి వార్డుకు మార్చనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్