దేశంలో యువతకు వర్క్ ఎక్స్పీరియన్స్ అందించే 'ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం' మూడో విడత కొనసాగుతోంది. ఈ పథకం కింద ఎంపికైన వారికి 6 నుండి 9 నెలల పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం లభిస్తుంది. వారికి నెలకు ₹9,000 స్టైపెండ్‌తో పాటు, ఒకేసారి ₹6,000 ప్రత్యేక గ్రాంట్ కూడా అందజేయబడుతుంది. ఈ ఇంటర్న్‌షిప్ కోసం 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉండి, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.