ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. ట్యాంకు కింద నలిగి ఇద్దరు సైనికులు మృతి
Nov 23, 2026, 09:11 IST/

ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. ట్యాంకు కింద నలిగి ఇద్దరు సైనికులు మృతి

Nov 23, 2026, 09:11 IST
హర్యానాలోని హిసార్ జిల్లాలో శనివారం జరిగిన సైనిక శిక్షణ విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. సుమారు 32 ట్యాంకులతో నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల సమయంలో, భారీ ధూళి కారణంగా మార్గం కనిపించక ఒక ట్యాంకు అదుపుతప్పి ఇద్దరు సైనికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాయక్ మనీష్ కుమార్, నాయక్ అంకుశ్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరిని వెంటనే మిలిటరీ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఆర్మీ అధికారులు, హిసార్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.