9/11 భయానక ఉగ్రదాడులకు 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా బాధితులను స్మరించుకుని ప్రధాని నరేంద్ర
మోదీ శుక్రవారం నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం లెక్కలేనన్ని ప్రాణాలను బలిగొందని పేర్కొన్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి బాధిత దేశంగా భారత్ దశాబ్దాలుగా ఉగ్రవాదంపై పోరాటంలో ముందుందని అన్నారు. ముప్పు రూపాలు మారుతున్నా.. అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే భారత్ సంకల్పం మాత్రం చెక్కుచెదరదని
మోదీ స్పష్టం చేశారు.