ఇస్రో చేపట్టిన GSLV-F18-NVS-03 మిషన్ విజయవంతం కావడంపై ప్రధాని
మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఈ మిషన్ NavIC నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, ఆత్మనిర్భర్
భారత్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని ప్రధాని పేర్కొన్నారు.