ప్రధాని నరేంద్ర
మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటనలో రాజకీయ, దౌత్య అంశాలతో పాటు ఒక ప్రత్యేక సాంస్కృతిక ఘట్టం కూడా చోటు చేసుకుంది.
మోదీ స్వయంగా రచించిన 'అభీ తో సూరజ్ ఉగా హై' కవితను ఉజ్బెక్
విద్యార్థులు హిందీ, ఉజ్బెక్ భాషల్లో ఆలపించారు.
మోదీ రచించిన మరో రెండు కవితలను కూడా
విద్యార్థులు ప్రదర్శించారు. తన కవితలను ఉజ్బెక్
విద్యార్థులు హిందీలో ఆలపించడం ప్రత్యేక అనుభూతినిచ్చిందని
మోదీ పేర్కొన్నారు.